Thursday, September 1, 2011

ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.

లక్ష్యం
బాపూజీ ఆశయాల సాధనలో, స్వర్ణాంద్ర ప్రదేశ్ నిర్మాణంలో భాగస్తుడ్ని కావాలని, ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల ఫై పోరాటం చేయాలని, నక్సలిజం వైపు సాగుతున్న యువతకు మార్గదర్శకాలు నిర్దేశించాలని, నా ఆలోచనలను 8 1/2 కోట్ల ప్రజల ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన ఉంది. ప్రజా సేవ చేసే ఆశయం ఉంది భారత రాజ్యాంగాన్ని మార్చడానికి నేను అంబేద్గర్ని కాను . భారత జాతిని ఏకతాటి ఫై నడిపించడానికి నేను మహాత్మా గాంధీని కాను. నా చుట్టూ ఉన్న కొద్ది మందికైన సేవలాంధించాలనేదే నా ఆలోచన.నిద్ర పోతున్న సమాజాన్ని మేలు కొలిపి, నవ సమాజ నిర్మాణానికి నాంది పలికి , బాపూజీ కలలు కన్నా స్వరాజ్య స్థాపన కోసం నిరంతరం శ్రమించాలని, స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమర వీరుల స్పూర్తిగా ముందుకు సాగిపోవాలనేదే నా ఆశయం.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.
లక్ష్యం వైపు మీ పయనం
సమయం నీదే.
సమరం నీదే.
గెలుపు నీదే.
ఓటమి దరికి రాదులే.
నువు వేసే ప్రతి అడుగు నీ లక్ష్యం కోసమే.
నీ లక్ష్యం కోసమే.

మన లక్ష్యం సాధనలో ఓటమి ఎదురైనప్పుడు
మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు మనకి టైమ్ బాగాలేదని.కానీ ఓటమికి కారణాలు వెతికి వాటిని సరిదిద్దుకొని తిరిగి మనం ప్రయత్నం చెయ్యం. అలా కాక తిరిగి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం.
ముఖ్యంగా మనం పాజిటివ్‌గా ఆలోచించాలి.
సమరం చేయాలి ఎవరితోనో కాదు?
మనలో ఉన్న భయం,ఆందోళన,నెగేటివ్ ఆలోచనల ఫై మనం సమరం చేయాలి.
అప్పుడు విజయం మనకు సొంతమవుతుంది.
మనం చేసే ఏ ప్రయత్నం అయినా మన లక్ష్యానికి దగ్గర అయ్యేలా ఉండాలి.
మీ ప్రయత్నాన్ని ప్రారంభించే ముందు మనస్పూర్తిగా దేవుని ప్రార్ధించండి.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.


నేటి సమాజం
అవినీతి పెరిగిపోయింది. హత్య రాజకీయాలు పెరిగి పోయినాయి. హింసాత్మక కార్య క్రమాల నిలయంగా వ్యవస్త మారిపోయింది. కొన్ని స్వార్ధాపర శక్తులు నేడు ఈ సమాజాన్ని శాసిస్తున్నాయి. మాననీయ విలువలు దిగజారి పోతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు అపహాస్యం అవుతున్నాయి. ఎక్కడ చూసిన పేదరికం. భూకబ్జాలు, హత్యా రాకీయాలు , ఉగ్రవాద కార్యకలాపాలు. నిరుద్యోగం. నిరాశాల బాటలో నక్సలిజం దిశగా యువత. ఆకలి చావులు, రైతు ఆత్మ హత్యలు.కుల పోరాటాలు, మత పోరాటాలు, వర్గ పోరాటాలు.ప్రతి భారతీయుడికి కనీస అవసరాలైన తిండి , బట్ట, గూడు లను సైతం కల్పించలేని పరిస్తితుల్లో 64వ స్వాతంత్ర వేడుకలను మనం జరుపుకున్నాం. 64 ఏళ్ల స్వేచ్ఛా స్వాతంత్రంలో మనం ఏమీ సాధించాం ? ఆకలి చావులు, రైతు ఆత్మహత్యల తప్పు.

ప్రభుత్వ వైఫల్యాలు
7 సం. రాల కాలంలో ఆంధ్ర రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించారు.
ప్రజాస్వామ్య విలువల్ని నడిరోడ్డు ఫై  కూనీ  చేస్తున్నారు
మాననీయ విలువల్ని మంటగలిపారు. 
  బడుగు జీవుల ఫై  తుపాకీ ఎక్కుపెట్టినారు.
పారిశ్రామిక వేత్తలకు వందల ,వేల  ఎకరాలు ధారాదత్తం చేసే ఈ ప్రభుత్వం   పేదవాడికి 3 సెంట్లు భూమి పంచడానికి అంగీకరించడం లేదు. 
అరాచకలను సమర్ధిస్తూ  వ్యవస్తను సర్వ నాశనం చేస్తున్నారు.
పేదల సంక్షేమం పట్టించుకోరు. విద్యార్ధులకు ఉపకార వేతనాలుండవు. ప్రభుత్వ హాస్టల్లో వసతులు సరిగా ఉండవు.నిత్యావసరాల ధరలు అదుపు చేయలేరు. రైతులను పట్టించుకోరు. సిమెంట్ ధరలను తగ్గించ లేరు.మద్యం వరదలా పారుతుంది. త్రాగు నీటి వసతులను నిర్లక్ష్యం చేస్తున్నారు, భూ కబ్జాలు, హత్యా రాజకీయాలు, రాస్త్ట్రం అంతా అవినీతిమయం, సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో ఆక్రమాలు, పత్రికల మీద కక్ష సాధింపు చర్యలు, ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అని అడుగుతున్నా.
వేసవిలో త్రాగడానికి నీరు లేదంటే మందు తాగమని సలహా ఇచ్చే విధంగా, ఊరూరా మరిన్ని బెల్ట్ షాపులకు అనుమతి నిచ్చి రాజీవ్ గ్రామీణ మంధ్ యోజన అనే పధకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది చాలా భాధాకరమైన విషయం. ఓటు బాంకు కోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం పరిస్తితి ఇలాగే ఉంటుంది.ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు.అదికార దాహం తప్ప. ముఖ్యమంత్రి  కలలు  కన్న ఇందిరమ్మ రాజ్యం ఇదేనా.


జగన్మోహనా
జగన్మోహన్ రెడ్డి గారు నైతిక విలువలను గురి0చి మాట్లాడట0 విడ్డూర0గా ఉ0ది.అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక విలువలు అనే పదానికి అర్ధ0 తెలుసా అని ఆశ్యర్య0 కలుగుతు0ది. నైతిక విలువలు గురి0చి మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డి గారికి ఉ0దా అని తనని తానే ప్రశ్ని0చుకోవాలి.తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో ఇటలీ రాణికి తాకట్టు పెట్టిన ఘనత వై.ఎస్.రాజశేఖర రెడ్డి గారికే దక్కి0ది.మీ త0డ్రి అధికార0లో ఉ0డగా గుర్తుకు రాని ఆత్మ గౌరవ0 ఇప్పుడు గుర్తుకు రావడ0 ఏరు దాటాక తెప్ప తగలేయడ0 లా0టిదే. కడప ఉప ఎన్నికల్లో విజయ భేరి మోగి0చే సత్తా మీకు0టే ఓటుకు 1250,వె0డి భరిణిలు,ఇ0కా అనేక మార్గాల ద్వారా మార్గాల ద్వారా ఓటర్లను, అధికారులను సైత0 ప్రలోభ పెట్టాల్సిన అవసర0 ఏము0ది? కా0గ్రెస్ పార్టీ ఎమ్.ల్.ఎ.లను తన వె0ట తిప్పుకొనే జగన్మోహన్ రెడ్డి గారు నైతిక విలువలు గురి0చి మాట్లాడట0 బాధాకర0. పెళ్లి ఒకరితో,స0సార0 మరొకరితో చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారి వర్గ ఎమ్. ఎల్.ఎ. వ్యవహరి0చడ0 ప్రజాస్వామ్యాన్ని అపహాస్య0 చేయడమే. ఇది వారి నైతిక పతనాన్ని,దిగజారుడు రాజకీయాలకు అద్ద0 పడుతు0ది.మధ్య0తర ఎన్నికలు, అద్ద0 పడుతు0ది.మధ్య0తర ఎన్నికలు రాకపోతే 2014 నాటికి సానుభూతి ఉ0డదని,తన అవినీతి, అక్రమాలు బయట పడి జైలుకి వెళ్ళాల్సి వస్తు0దనే ఆ0దోళన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఉ0దనేది స్పస్ట0గా తెలుస్తో0ది.దా0ట్లో ఎటువ0టి అపోహలకి తావు లేదు.లేద0టే ఏదోలా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు,కుత0త్రాలు చేయవలసిన అవసర0 ఏము0ది.లీడర్ సినిమాలో హీరోలా జగన్మోహన్ రెడ్డిని
పోలుస్తున్నారని విన్నా,ఆ హీరోలా మీరు కూడా లక్ష కోట్ల అవినీతి సొమ్మును ప్రజలకు ప0చి పెట్టి,నిస్వార్ధ0గా జన0లోకి వస్తే మీ పార్టీలోకి రావడానికి నేను సిద్ద0. మీరు సిద్దమా.2014 వరకు జన0 సమస్యల పై పోరాట0 చేసి అప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తే మీ సత్తా చూప0డి.గత0లో ఎప్పుడు జన0 సమస్యల పై పోరాట0 చేసిన దాఖలాలు లేవు.అధికార0 కోస0 ఇప్పుడు ప్రజల పై కపట ప్రేమ ఒలక పోస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జనం కోసం ఏం చేశారు ?
ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకున్నారా?
కనీసం ఓదార్పు నిచ్చారా? జనం సమస్యల ఫై కనీసం స్పందించారా?
ఇన్నాళ్లు జనం భాదలు పట్టలేదు, అవకాశ రాజకీయాలకు కోస0 ప్రజల పై కపట ప్రేమ ఒలక పోయడ0 ఆయన స్టాయిని దిగజార్చుకోవడమే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య మ0త్రి అయితే పెళ్ళి ఒకరితో స0సార0 ఒకరితో చేసుకోవచ్చు అని జీవో పాస్ చేస్తారేమో.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.


177 జీవో
177 జీవోలో తప్పేము0దని ఉద్యోగ స0ఘాలు రాద్దా0త0 చేస్తున్నాయి. ఉద్యోగుల ఉద్యమాల పేరుతో విధులు బహిష్కరి0చినా,తమ విధులని సక్రమ0గా నిర్వర్తి0చక పోయినా ప్రభుత్వ0 చూస్తూ ఉ0డాలా? ప్రభుత్వ0 తరపున ప్రజలకు సేవల0దిచ వలసి0ది పోయి ఉద్యమాల పేరుతో, సహాయ నిరాకరణల పేరుతో విధులను బహిష్కరి0చడ0 సమ0జస0 కాదు.మీ ఉద్యమాలకు బలి అవుతు0ది సాధారణ ప్రజానీక0 మాత్రమే అని మీరు తెలుసుకో0డి.
కొ0త మ0ది వ్యక్తుల మాయలో పడి మీ బాధ్యతలు విస్మరి0చక0డి.ప్రభుత్వానికి హెచ్చరిక అనుకు0టున్నారే గాని 10 కోట్ల ఆ0ధ్రుల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నామని మీరు గ్రహి0చ0డి.పని చేయకు0డా జీత0 తీసుకోవడ0 సిగ్గు చేటు.నేను స0సార0 చేయను కానీ నాకు పిల్లాడు కావాలన్నట్టు ఉ0ది మీ వ్యవహార0. ప్రభుత్వ కార్యాలయాలలో పని తీరు అ0త0త మాత్రమే. ఆ చేసేది కొద్ది కూడా సహాయ నిరాకరణల పేరుతో విధులు బహిష్కరి0చడ0 ఖ0డిచవలసిన విషయ0.
మన0 వాడే ప్రతి వస్తువుకి పన్ను కడుతున్నా0.ఆ పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయి.ఉద్యోగుల జీతాలు మన0 కట్టే పన్నులే అన్న విషయ0 మన0 మళ్ళీ గుర్తుచేసుకు0దా0. ప్రజల్లో చైతన్య0 ద్వారా 177 జీవో అమలవ్వాలని ప్రభుత్వ0 పై ఒత్తిడి తీసుకొద్దా0.అది మన0దరి నైతిక భాధ్యత. మన0 కట్టే ప్రతి రూపాయి సద్వినియోగ0 అవ్వాలన్నదే నా ఉద్దేశ0.అ0తేగాని ఎవరినీ కి0చ పరచాలని నా ఆలోచన కాదని గుర్తి0చమని కోరుతున్నా.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి


నాయాపూల్ ఆసుపత్రిలో జూ.డా.ల ఫై దాడిని నిరసిస్తూ నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం ఇంకా మరచిపోక ముందే మళ్లీ జూ.డా.ల ఫై నయపూల్ ఆసుపత్రిలో దాడి జరిగింది.అసలు ఏం జరుగుతుంది.చెయ్యెత్తి దండం పెట్టవలసిన వైద్యుల ఫై ప్రత్యక్ష దాడులకు దిగడం భాధాకరం.ప్రజల యొక్క మనోభావాలు ఎలా మారుతున్నాయి?చిన్న సమస్య సైతం కొన్ని స్వార్ధాపర శక్తుల ప్రవేశంతో జటిలం అవుతున్నాయి.సమాజంలో జరుగుతున్న హింసాత్మక కార్యకలాపాలను అడ్డుకోవడంలో ఇటు ప్రభుత్వం,న్యాయ వ్యవస్త ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి.న్యాయస్థానం ఆదేశాల మేరకు విధుల్లోకి హాజరయిన జూ.డా.లకు తగిన రక్షణ సౌకర్యాలు కల్పించలేక పోవడం ఈ ప్రభుత్వ అసమర్ధత. ఓటు బాంకు కోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం పరిస్తితి ఇలాగే ఉంటుంది.ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవు.అదికార దాహం తప్ప. మనం ఒక విషయం ఆలోచిద్దాం.వైద్యుల నిర్లక్షం వల్ల మన బంధువులు ఎవరో చనిపోయారని అనుకుందాం. మన బంధువులను చంపడం వల్ల వాళ్ళకు కలిగే ప్రయోజనం ఏంటి ? వాళ్ళు మనకు శత్రువులు కాదుగా ? ఒక వేళ నిజంగా వైద్యుల నిర్లక్ష వైకరి వల్ల మనకు అన్యాయం జరిగితే న్యాయ వ్యవస్త ద్వారా పోరాటం చేయాలే తప్ప ప్రత్యక్ష దాడులకు దిగటం ఎంత వరకు సమంజసం. రోజూ ఒకో ఆసుపత్రిలో వైద్యుల ఫై దాడులు జరగటం, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల వాళ్ళు ఎలా పనిచేయగలరు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోదు.ఇంక వాళ్ళు అనుభవించే మానసిక వేదన ఎవరితో చెప్పుకోగలరు. నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం తర్వాత అయినా ప్రభుత్వం కళ్ళు తెరచీవుంటె నాయాపూల్ ఆసుపత్రి సంఘటన నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం తర్వాత అయినా ప్రభుత్వం కళ్ళు తెరచీవుంటె నాయాపూల్ ఆసుపత్రి సంఘటన పునరావృత్తం అయ్యేది కాదు. ఈ దాడులకు పూర్తి భాద్యత ప్రభుత్వానిదే.ఇప్పటి కైనా ప్రభుత్వం కళ్ళు తెరచి వైద్యుల రక్షణ చర్యలు
చేపట్టవసిందిగా కోరుతున్నాను.ప్రత్యక్ష దాడుల వల్ల వేదనకు గురయిన నా వైద్య సోదర,సోదరీమాణుల తరపున ఆవేదనతో
మీ సోదరుడు,
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.



ర్యాగింగ్
కాలేజీ జీవనంలో ర్యాగింగ్ అనే పదం భయంకరమైనది.ర్యాగింగ్ అనేది ఒక భూతం వంటిది.ఈ ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొట్ట వలసిన భాద్యత మనందరిది.ఆది మనందరి సామాజిక భాద్యత.ర్యాగింగ్ అంటే ఒక వ్యక్తిని శారీరకంగా గాని,మానసికంగా గాని,హింసించి ఆనందించడం. ఒకరిని హింసించి,తను ఆనందపదేవాడు శాడిస్ట్.నా ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ఏ యువకుడు శాడిస్ట్ కాడు.కాకూడదు.మన తల్లిదండ్రులు ఎంతో కస్టపడి తమ రక్తాన్ని చెమటగా చిందీంచి మనకు విద్యా బుద్దులు నేర్పిస్తున్నారు.మన అమ్మా,నాన్నల కలలు నిజం చేయవలసిన భాద్యత మన ఫై ఉంది.కాలేజీ జీవనంలో ర్యాగింగ్ పేరుతో బలి అయిన ఎంతో మందిని మనం చూశాం. కుల,మతాల కతీతంగా ఒక్కటిగా సాగుతున్న సామాజిక కుటుంబం కాలేజీ.అక్కడ ఉన్న వారంతా మన సోదరులే.మనం ర్యాగింగుల పేరుతో హింసించేది ఎవరినో కాదు మన సోదరినో , సోదరుడినో.భారత దేశము నా మాతృభూమి. భారతీయులందరు నా సహొదరులు అని మనం చేసిన ప్రతిజ్ఞ మనం మరచిపోవద్దు.
ఈ సమాజం అవినీతి,ఆక్రమాల పుట్టలా తయారయింది.కొన్ని స్వార్ధాపర శక్తులు ఈ సమాజాన్ని శాశిస్తున్నాయి. ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి.భావి భారతదేశాన్ని ముందుకు నడిపించవలసిన భావి భారత పౌరులం మనం.మనం ఈ వ్యవస్తను మార్చాలి తప్పితే మనం తప్పు చేయకూడదు.కాలేజీల చరిత్రలో ఈ ర్యాగింగ్ పరంపర చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేద్దాం.మన సీనియర్లు మనల్ని ర్యాగింగ్ చేశారు కాబట్టి మనం మన జూనియర్లను ర్యాగింగ్ చేద్దాం ఆలోచనకు స్వస్తి చెప్పండి.ఎందుకంటే మన సీనియర్ల
వల్ల మనం ఎంత ఇబ్బందులకు గురయ్యామో మనకు మాత్రమే తెలుసు.మనం మన జూనియర్లను ర్యాగింగ్ చేస్తే వాళ్ళెంత భాదపదతారో
మనకు అర్ధం అవుతుంది.అందుకే మనం ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకుందాం.మన జూనియర్లతో సైతం సోదర భావంతో మెలగుదాం.మన పూర్తి సహాయ సహకారాలు అందిద్దాం.మనం మన భావితరానికి స్పూర్తిగా నిలుద్దాం.కొద్ది కాలంలోనే కాలేజీల చరిత్ర పుటల్లో ర్యాగింగ్
అనే పదం మాయమవుతుంది.మన స్నేహితులు పోగుడుటున్నారని మనం మరింత ఉత్సాహంతో ర్యాగింగ్ చేస్తాం.మీ వల్ల భాదపడిన వారు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే మీకు జైలు జీవితం , మీ తల్లిదండ్రులకు అవమానాలు,తీవ్ర మనస్తాపం,భాదితుని తల్లిదండ్రులకు గర్భ శోకం.
జరగ రానిది జరిగాక పచ్చాతాపపడినా ప్రయోజనం శూన్యం.

నీ తోటి మనిషిని ద్వేషించ వద్దు.ప్రేమించడం నేర్చుకో.గతంలో ఎప్పుడయినా మీ వల్ల ఎవరయినా భాదపడితే వారికి దయ చేసి క్షమాపణ చెప్పండి లేదా కనీసం ఆప్యాయంగా పలకరించండి.ఆ సంతోషం మీకే తెలుస్తుంది.

ఒక సోదరుడిగా నేటి సమాజంలో ర్యాగింగ్ పేరుతో జరుగుతున్న ఆకృత్యాలకు బలవుతున్న నా సోదర,సోదరీమణుల తరపున మనస్పూర్తిగా చేస్తున్నవిజ్ఞప్తి.అలాగని నేను చెప్పింది చేయాలనటం లేదు కనీసం ఆ దిశగా ఆలోచించమంటున్నా.నేను చెప్పింది వాస్తవం అని నమ్మితే
ఆచరించండి.
ఆలోచించండి ఆచరించండి. నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.
సదా మీ సేవలో
మీ బాపూజీ
సామాజిక, ఆర్ధిక,రాజకీయ అంశాల ఫై అక్షర సమరం

చిరు రాజకీయ ప్రవేశం ఫై
చిరంజీవి మంచి నటుడు,కళాకారుడు.తన నటనతో ఎంతో మంది మనసులు దోచుకున్నాడు.ఆ అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలణుకోవడం దురధృష్టకరం.అభిమానుల పేరుతో జరుగుతున్న ర్యాలీలు వాస్తవంగా అభిమానులు చేసేవి కావు.వాటి వెనుక ఒక బలమైన సామాజిక వర్గం ఉందనేది వాస్తవం.ఇప్పటి వరకు రెడ్డి, కమ్మ కులాల వారు మాత్రమే ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని ఆ సామాజిక వర్గం చిరంజీవినీ రంగంలోకి దింపింది.ఇది అధిపత్య పోరు మాత్రమే అన్నది వాస్తవం.మత పార్టీలు వచ్చినాయి.ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి.ఇప్పుడు కుల పార్టీలు పుట్టుకొస్తున్నాయి. కొన్నాళ్లకు వీధికొ పార్టీ పుడుతుందంటే అనుమానం లేదు.సమాజం అభివృద్ది పట్ల ఎవరికి ఆలోచన లేదు.కులాల కుమ్ములాటలు,మతాల మారణ హొమాలు తప్ప.
జనం కోసం చిరంజీవి గారు ఏం చేశారు ?
ఆత్మహత్యలు చేసుకున్న రైతులను ఆదుకున్నారా?
కనీసం ఓదార్పు నిచ్చారా?
లుంబిని పార్కు భాదితులను కనీసం పలకరించారా?
జనం సమస్యల ఫై కనీసం స్పందించారా?
చిరంజీవి గారికి ఎందుకు ఓటెయ్యాలి?
సరే ఆయన బ్లడ్ బాంకు, ఐస్ బాంకు పెట్టినండు వల్ల కొంత మందికి ప్రయోజనం ఉండి కాబట్టి ఆయనకు ఓటు వేద్దాం.ఆయన ప్రతి పాధించిన వారికి ఎందుకు ఓటెయ్యాలి?
ఇన్నాళ్లు జనం భాదలు పట్టలేదు., ఎన్నికలు సమీపిస్తుండటంతో అభిమానుల అభిమానాన్ని అవకాశ రాజకీయాలకు వినియోగించాలనుకోవడం ఆయన స్టాయిని దిగజార్చుకోవడమే అవుతుంది.అభిమానం వేరు రాజకీయం వేరు అని ఎప్పటికీ తెలుసుకుంటారో వేచి చూద్దాం.
కె.సి.ఆర్. ది ప్రాంతీయ రాజకీయం, చిరంజీవిడీ అవకాశవాద రాజకీయం.
పదవుల కోసం ప్రాంతీయ విబేధాలు రెచ్చగొట్టిన కె.సి.ఆర్.కి,అభిమానుల అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలణుకొనే చిరంజీవి గారికి తేడా ఏముంది?
ఏ ప్రభుత్వాలు వచ్చినా పేదవాడికి న్యాయం జరగాలనేదే మా విన్నపం.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.

చిరంజీవి గారు ఆలోచించండి
చిరు రాజకీయాల్లోకి రావడం ఆయన వ్యక్తిగత విషయం.అయితే తెలుగు దేశం,కాంగ్రెస్ విమర్శిస్తూ అధికారంలోకి రావాలనుకోవడం భాదాకరం. జూబ్లీహిల్ల్స్‌లో 500 గజాలు కబ్జా చేసినారు.బ్లడ్ బాంకు పేరుతో జనం రక్తాన్ని కార్పొరేటే ఆసుపత్రులకు అమ్ముకుంటున్నారు. పవన్ కల్యాణ్ జీవితాన్ని సరిదిద్దలేకపోయారు.మీ కూతురి ప్రేమ అంగీకరించలేదు.ఎవరో అమ్మాయికి దగ్గరుండి ప్రేమ కులాంతర వివాహం చేయించారు.ఒక కుటుంబ పెద్దగా మీ కుటుంబాన్ని సరిదిద్దలేక పోయారు.మీరు ఈ రాష్ట్ర రాజకీయాలు ఎలా మార్చగలరు? ఎవరైనా విమర్శలు చేస్తే మీరు సేవా కార్యక్రమాలు చేయండి అని అభిమానులకు సూచిస్తునారు.ఇది ఎలా ఉంది అంటే మీరు రక్తదానం చేయండి,మేం అమ్ముకుంటాం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు.బ్లడ్ బాంకు,ఐ బాంకు పన్నులు ఎగ్గొట్టడానికే గాని జనం కోసం కాదు అనేది 7 కోట్ల ప్రజానీకానికి తెలుసు.చిరు ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడే గాని జనం నాయకుడు కాదనేది వాస్తవం.5000 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.ఎరువుల కోసం రోడ్లు ఎక్కారు.అప్పుడు మీరు కనీసం స్పందించలేదు.ఇప్పుడు రైతు సేవే మీ అజెండా అంటున్నారు.అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తామంటున్నారు.500 గజాలు కబ్జా చేయడం అవినీతి కాదా? ప్రజల రక్తాన్ని అమ్ముకోవడం అవినీతి కాదా?మీరా అవినీతి గురించి మాట్లాడేది.తెలుగు దేశం,కాంగ్రెస్ పార్టీలు అవినీతిలో కూరుకు పోయాయని మీరు మాట్లాడుతున్నారు.అటువంటప్పుడు తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీ నాయకులను వల వేసి మరీ లాక్కుపోతున్నారే అంటే మీ పార్టీకి సైద్ధాంతికమీ పార్టీకి నైతిక విలువలు ఎక్కడున్నాయి.కొత్త సీసాలో పాత నీరే.ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నాయకులను,రోజుకో పార్టీ మారే జోగయ్య,పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళను పెట్టుకుని ఈ రాష్ట్ర రాజకీయాలను ఎలా మారుస్తరొ వేచి చూద్దాం.వ్యక్తిగతంగా చిరంజీవి గారి ఫై ఎలాంటి ద్వేషం లేదు.వారి అవకాశ వాద రాజకీయాన్ని సమర్ధించలేక పోతున్నా.నా ఈ ప్రయత్నం సామాజిక మార్పు కోసం.
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.
.



1 comment:

Anonymous said...

మీ ఆవేదన సరైనదే.