Thursday, September 1, 2011

అవినీతి

ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం.
ఏ జాతి దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం
అంతా అవినీతిమయం. అవినీతి అనేది ఒక భూతం వంటిది.ఈ అవినీతి భూతాన్ని తరిమి కొట్ట వలసిన భాద్యత మనందరిది.
కొన్ని సంఘ విద్రోహ శక్తులు ఈనాడు సమాజాన్ని శాసిస్తునాయి. హత్య రాజకీయాలు,హింసాత్మక కార్య క్రమాల నిలయంగా వ్యవస్త మారిపోయింది.మాననీయ విలువలు దిగజారి పోతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు అపహాస్యం అవుతున్నాయి. ఎక్కడ చూసిన పేదరికం. భూకబ్జాలు, హత్యా రాకీయాలు , ఉగ్రవాద కార్యకలాపాలు, నిరుద్యోగం, నిరాశాల బాటలో నక్సలిజం దిశగా యువత, ఆకలి చావులు, రైతు ఆత్మ హత్యలు,కుల పోరాటాలు, మత పోరాటాలు, వర్గ పోరాటాలు. పేదల సంక్షేమం పట్టించుకోరు. విద్యార్ధులకు ఉపకార వేతనాలుండవు. ప్రభుత్వ హాస్టల్లో వసతులు సరిగా ఉండవు.నిత్యావసరాల ధరలు అదుపు చేయలేరు. రైతులను పట్టించుకోరు. త్రాగు నీటి వసతులను నిర్లక్ష్యం చేస్తున్నారు. మద్యం వరదలా పారుతుంది. వేసవిలో త్రాగడానికి నీరు లేదంటే మందు తాగమని సలహా ఇచ్చే విధంగా, ఊరూరా మరిన్ని బెల్ట్ షాపులకు అనుమతి నిచ్చి జాతీయ గ్రామీణ మ0దు యోజన అనే పధకాన్ని ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి.ప్రతి భారతీయుడికి కనీస అవసరాలైన తిండి , బట్ట, గూడులను సైతం కల్పించలేని పరిస్తితుల్లో 64వ స్వాతంత్ర వేడుకలను మనం జరుపుకున్నాం. 64 ఏళ్ల స్వేచ్ఛా స్వాతంత్రంలో మనం ఏమీ సాధించాం ? ఇది చాలా భాధాకరమైన విషయం.దీనికి కారణం అవినీతి.
ఓటు బ్యాంకు కోసం అవకాశవాద రాజకీయాలు చేసే ప్రభుత్వాలు ఉన్నంత కాలం పరిస్తితి ఇలాగే ఉంటుంది. ఓట్లేసి అధికారం ఇస్తే తమకు ఏదో న్యాయం చేస్తారని నమ్మిన ప్రజల ఆలోచనలకు విరుద్దంగా ఏ.సి.రూముల్లో, విందులతో కాలం గడిపే, అవకాశవాద,స్వార్ధాపర,అవినీతి శక్తుల వల్ల దేశ పురోగతికి నష్టం కలుగుతుంది.
భారతీయ న్యాయ వ్యవస్తలో కొన్ని లోపాలున్నాయి.వాటిని సరిదిద్ద వలసిన అవసరం ఎంతయినా వు0ది. అవినీతి అక్రమార్కులని శిక్షి0చాల0టే 100 సెక్షన్లు వు0టే ,వారు బయటకు రావడానికి 200 సెక్షన్లు వున్నప్పుడు అవినీతి అక్రమార్కులకు అడ్డుకట్ల వేయడం ఎలా? 100 కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తులను స0వత్సరాల తరపడి,వాయిదాల పేరుతో గడుస్తుంటే అవినీతిని అడ్డుకోవడ0 ఎలా? అవినీతి అక్రమార్కులను వెంటనే శిక్షించాలి.ఏ స్తాయి వ్యక్తులయినా అవినీతి పాల్పడితే,తప్పు చేస్తె శిక్ష తప్పదనే స్పష్టమైన సంకేతం ప్రభుత్వాలు ఇవ్వగలిగిన రోజున అవినీతి అనే పదం కాల గర్భంలో కలసి పోతు0ది. అక్రమార్కుల ఫై ప్రభుత్వాలు కొరడా జులిపి0చనంత కాలం ఈ అవినీతిని అడ్డుకట్ట వేయటం సాధ్యం కాదు.స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు మూలుగుతున్నా,వాటిని దేశానికి రప్పించే సత్తా ప్రభుత్వాలకు లేక పోవడం,అక్రమార్కులకు ప్రభుత్వాలు వంత పాడటం భాదాకరం.ప్రభుత్వ కార్యాలయాలలో చేయి తడిపితే గాని ఫైలు కదలని పరిస్తితి. ఇటువంటి సమాజం కోసమా నేను పోరాటం చేసి0ది అని గా0ధీ మహాత్ముడే కన్నీరు పెట్టుకునే పరిస్తితి నేటీ సమాజ0లో వు0ది.లక్షల కోట్ల కుంభ కోణాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం భాదాకరం.
రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, 100 కోట్ల భారతీయుల ప్రయోజనాల కోసం వారధులుగా పని చెయ్యగలిగితే అవినీతి అనే పదం కనుమరుగవుతు0ది. దిగజారి పోతున్న మాననీయ విలువల్ని కాపాడడం కోసం మనం పోరాటం చేయాలి. అవినీతి ప్రభుత్వాలను గద్దె దింపడం కోసం మనం పోరాటం చేయాలి.వ్యక్తుల  కోసం మనం పోరాటం  కాదు.వ్యవస్త గురించి మన పోరాటం. వ్యవస్తాలో ఉన్నటువంటి  లోపాలను సరిదిద్దడం  కోసం మనం పోరాటం చేయాలి.
సమాజమే దేవాలయం.పేద ప్రజలే  మా దేవుళ్ళు  అన్నది  రాజకీయ నాయకుల నినాదం కావాలి. భావి భారతదేశాన్ని ముందుకు నడిపించవలసిన భావి భారత పౌరులం మనం.మనం
ఈ వ్యవస్తను మార్చాలి.యువత ర్యాగింగ్ల, పబ్ల పేరుతో,విదేశీ సంస్కృతుల పేరుతో తమ విలువైన సమయాన్ని వ్రుధా చేసుకోకు0డా సమాజం పట్ల తమకున్నటు వంటి నైతిక భాధ్యత గుర్తించి,ఆ దిశగా ఆలోచన చేయగలిగినప్పుడు ఈ సమాజంలో గాని,వ్యవస్తలో మార్పు తీసుకు రావడం సాధ్య మవుతుంది.ఈ దేశం ఏమిచ్చింది అని కాకుండా మనం ఈ దేశానికి ఏమిచ్ఛాం
అని అలోచి0చ గలిగే రోజు రావాలి. వ్యవస్త నిర్మాణంలో,అవినీతి రహిత సమాజంలో భాగస్తులు కాగలిగినప్పుడు అవినీతి రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది.
ఏ వ్యవస్త నిర్వీయం అయిపోతుందో, ఏ సమాజంలో విచ్చిన్నకరశక్తులు తమ విస్తృత ప్రయోజనాల కోసం వ్యవస్తను భ్రష్టు పట్టీంచె కార్య క్రమాలు చేపడుతున్నారో,అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నరో అటువంటి వ్యక్తుల నుండి సమాజాన్ని కాపాడుకోవలసిన భాధ్యత మన ఫై ఉంది.ఎవరో వస్తారని ,ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నాడు ఓ మహా కవి. ఎవరో వస్తారని ,ఏదో చేస్తారని చూడకు0డా మనమే అవినీతిని అంతం చేయడానికి పూనుకోవాలి.మనలో కొందరు ఓటును నోటుకు అమ్ముకుంటున్నారు. దీని వల్ల కొంత వరకు అవినీతికి ఆస్కారం ఏర్పడుతుంది.మన ఓటును అమ్ముకోవడం వల్ల మనం అక్రమార్కులను ప్రశ్నించే అవకాశం కోల్పోతున్నాం.
ఒక అన్నా హజారేనో మరి ఎవరన్నా అవినీతి పై పోరాటం చేస్తున్నప్పుడు సంఘీభావం ప్రకటిస్తున్నామే తప్ప మనకు మనంగా ఎవరు అవినీతి పై పోరాటం చేసిన దాఖలాలు లేవు.మన అలోచనా విధానంలో మార్పు రావాలి.లోకపాల్ బిల్లు వచ్చే వరకు మన పోరాటం సాగించాలి.లోకపాల్ బిల్లు వచ్చినా అది అమలు జరిగే వరకు మన పోరాటం ముందుకు సాగాలి. ఎన్ని చట్టాలు వచ్చినా ప్రభుత్వాలు అక్రమార్కుల పై కొరడా జులిపించనంత కాలం,పాలించే పాలకులే ప్రేక్షకులై మౌనంగా చూస్తున్నంత కాలం అవినీతికి అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు.పంట చేలో కలుపు మొక్కలు ఏరి వేసినట్టు ఈ సమాజంలో ఉన్న అవినీతి శక్తులను కూకటి వేళ్ళతో పెకిలించి వేయాలి.కుల,మత,వర్గ ప్రభావాలకు లోను కాకుండా సమర్ధ నాయకుల్ని ఎన్నుకోవడం ద్వారా కొంత వరకు అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు.
నిద్ర పోతున్న సమాజాన్ని మేలు కొలిపి, నవ సమాజ నిర్మాణానికి అంతం నాంది పలికి, బాపూజీ కలలు కన్నా స్వరాజ్య స్థాపన కోసం నిరంతరం శ్రమించాలని,స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమర వీరుల స్పూర్తిగా ముందుకు సాగిపోవాలనేదే మన ఆశయం కావాలి. కనీసం రాబోయే యువతరం అయినా మంచి అభ్యుదయ భావాలతో ,సమాజానికి మంచి చేయాలని అవినీతిని అంతం చేసే ఉద్యమ శక్తులుగా రాజకీయాలలోకి రావాలని ఆకాంక్షిద్దాం.అటువంటి వారిని ఆదరిద్దాం
ఆలోచించండి ఆచరించండి అవినీతి రహిత సమాజ నిర్మాణానికి నాంది పలకండి.

No comments: