Thursday, September 1, 2011

అవినీతి రహిత సమాజం కోసం

బాపూజీ కలలు కన్న భారత దేశం.
అంతా అయిపోయింది అవినీతి మయం.
ఆకలి చావులు, రైతు ఆత్మహత్యలే మనం సాధించిన 64 ఏళ్ళ స్వేచ్ఛా స్వాతంత్ర్యం.
త్రాగేందుకు నీరు లేని వైనం.
మద్యం ఏరులై పారుతున్న దౌర్భాగ్యం.
ఓటు బ్యాంకు కోసం నోటు రాజకీయం.
అపహాస్యం అవుతున్నది ప్రజాస్వామ్యం.
లక్షల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతున్నా,
పాలించే పాలకులే ప్రేక్షకులై మౌనంగా చూస్తున్నా,
న్యాయ స్తానాలే కొరడా జులిపిస్తున్నా,
మారని నాయకుల తీరు,
ఇదే ఇదే మన భరతావని దౌర్భాగ్యం.
అవినీతి పై అన్నా హజారే పూరించెను సమర శంఖారావం.
అవినీతిని అంతం చేసే వరకు ఈ ఆగదు ఈ పోరాటం.
అక్రమార్కులను జైలుకు పంపే వరకు ఆగదు మా పోరాటం.
అవినీతి రహిత సమాజమే మా నినాద0.
అవినీతి పై సమరానికి మే0 సిద్ద0.
అక్రమార్కులను తరిమి కొట్టేందుకే మా ఈ ప్రయత్నం.
మన యుద్ధం,మన పోరాటం అవకాశ వాద వ్యక్తుల పైనే.
దేశాన్ని దోచుకొనే దోపిడీ దారుల పైనే.
స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన అమర వీరుల సాక్షిగా.
అవినీతి రహిత సమాజమే మన0 కోరుకు0టున్నా0.
అవినీతి వ్యతిరేక నినాద0తో ము0దుకు సాగిపోతున్నా0.
బాపూజీ ఆశయాల పయనిస్తా0.
దేశాన్ని కాపాడుకు0టా0.





2 comments:

సుభద్ర said...

very very nice..

srinivasrjy said...

అవును ... నిజంగా నిజం