Thursday, December 13, 2007

నీలోఫర్ ఆసుపత్రి వ్యవహారం ఫై బాపూజీ ఆవేదన

నేటి సమాజంలో వైద్యం వ్యాపారమైపోయింది. వైద్యుడు దేవుడితో సమానమని మనం భావిస్తాం. ఈనాడు ఆది వ్యాపారమైపోయింది. కార్పొరేటే ఆసుపత్రులలో పేదవాడికి వైద్యం అందదు. వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు సరైన వైద్య సదుపాయాలు అందటం లేదు. 'అప్పిచ్చు వాడు వైద్యుడు' అన్నది ఒకప్పటి సామెత. మాకు అప్పు అక్కరలేదు కాని నరైన వైద్యం అందించండి అంటున్నారు ప్రజలు. ప్రభుత్వ ఆసుపత్రులలో కొంత మంది సిబ్బంది యొక్క నిర్లక్ష్య వైకరి వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వైనాలు ఎన్నో చూశాం. అలాగని వైద్య వ్యవస్తను తప్పు పట్టలేం. ప్రభుత్వ వైద్యులలో ఎంతో మంది సేవా భావం కలిగినవాళ్ళు ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం నీలోఫర్ ఆసుపత్రిలో జరిగిన విషయం భాదాకరం.. ఒక ప్రజా ప్రతినిధి నీలోఫర్ ఆసుపత్రి వైద్యులతో వాగ్వివాదానికి దిగి చేయి చేసుకున్నారని జూనియర్ వైద్యులు సమ్మె ప్రకటించారు. ఈ సమ్మె చాలా రోజులు సాగింది. ఆ ప్రజా ప్రతినిది ఫై చర్య చేసుకొనేవరకు సమ్మె విరమించేది లేదని . జూ. వైద్యులు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల్లు చేయడంలో విఫలమైనది. ఈ సమ్మె కారణంగా ఎన్నో చిన్ని ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఎంతో మంది తల్లులకు గర్భ శోకం మిగిలింది.
దీనికి భాద్యులు జూ. వైద్యులా ? ప్రభుత్వామా ? నాయకులా ? అన్నది ప్రశ్నార్ధకం. ఆ ప్రజా ప్రతినిధి ఫై చర్య తీసుకున్న మీ వైఖరి వల్ల అమాయకంగా బలయిన ఆ చిన్నారులను మీరు మీరు తీసుకు రాగలరా ? ఆ చిన్నారుల తల్లిదండ్రుల గర్బ శోకం తీర్చేవారెవరు ? జూ. వైద్యులు తమకు జరిగిన అన్యాయాన్ని చట్ట పరంగా పోరాడవలసింది పోయి ప్రజా ప్రయోజనాలు విస్మరించి భాద్యతారహితంగా వ్యవహరించడం భాధాకరం. దీనీఫై హైకోర్టు చేసిన విన్నపాన్ని మన్నించక పోవడం భారతీయ న్యాయ వ్యవస్తను కించ పరచడమే అవుతుంది. ఈ సమ్మె వల్ల బలి అయిన చిన్నారుల తల్లిదండ్రుల కోణంలో మీరు ఆలోచన చేయండి. వాళ్ళ మానసిక వేదన మీకు అర్ధం అవుతుంది. మీ సమ్మెకు పరిష్కారం లభించింది. సరిఅయిన సమయంలో మీ వైద్యం అందక అసువులు బాసిన ఈ చిన్నారులను బలి తీసుకున్న పాపం ఎవరిది ?
అలాగని మీ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిని ఉపేక్షించమని నేను చెప్పడం లేదు. వైద్యులుగా మీ యొక్క భాద్యతలను నిర్వహిస్తూనే చట్ట పరంగా మీ సమస్యలను పరిష్కారించుకుంటే ఎంతో మంది తల్లులకు గర్బ శోకం మిగిలేది కాదనేది వాస్తవం. మీ
ప్రయోజనాలు కాపాడుకుంటూనే ఇతరుల ప్రయోజనాలు కాపాడవలసిన భాద్యత మీది.'వైధ్యో నారాయణ'అంటే వైద్యుడు నారాయణుడుతో
సమానం అంటే దేవుడితో సమానం అని అర్ధం.ఈ దేవుళ్ళు దయ చూపాలి.కానీ ఆగ్రహావేశాలకు గురికాకూడదు. జరిగినది ఏదో
జరిగిపోయింది. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు పునరావృత్తం కాకూడదనే నా విన్నపం.
ఈ సమ్మె వల్ల బలి అయిన పసి పాపల తల్లితండ్రుల తరపున ఆవేదనతో
మీ సోదరుడు
బాపూజీ
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి.

No comments: