Sunday, January 6, 2008

లక్ష్యం వైపు మీ పయనం

సమయం నీదే.
సమరం నీదే.
గెలుపు నీదే.
ఓటమి దరికి రాదులే.
నువు వేసే ప్రతి అడుగు నీ లక్ష్యం కోసమే.
నీ లక్ష్యం కోసమే.

మన లక్ష్యం సాధనలో ఓటమి ఎదురైనప్పుడు
మనం అనుకుంటూ ఉంటాం ఇప్పుడు మనకి టైమ్ బాగాలేదని . కానీ ఓటమికి కారణాలు వెతికి వాటిని సరిదిద్దుకొని తిరిగి మనం ప్రయత్నం చెయ్యం. అలా కాక తిరిగి ప్రయత్నం చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాం.
ముఖ్యంగా మనం పాజిటివ్‌గా ఆలోచించాలి.
సమరం చేయాలి ఎవరితోనో కాదు?
మనలో ఉన్న భయం,ఆందోళన,నెగేటివ్ ఆలోచనల ఫై మనం సమరం చేయాలి.
అప్పుడు విజయం మనకు సొంతమవుతుంది.
మనం చేసే ఏ ప్రయత్నం అయినా మన లక్ష్యానికి దగ్గర అయ్యేలా ఉండాలి.
మీ ప్రయత్నాన్ని ప్రారంభించే ముందు మనస్పూర్తిగా దేవుని ప్రార్ధించండి.
అంతా శుభం కలుగుతుంది।
ఆలోచించండి ఆచరించండి నవ సమాజ నిర్మాణానికి నాంది పలకండి

No comments: